రవి వర్మ కుంచే నుండి జాలువారిన అందాల పెయింటింగ్ రూపంలో పలువురు హీరోయిన్లు ఫోజులిచ్చారు.అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అచ్చం రవివర్మ గీసిన బొమ్మలకు ప్రతిరూపంలా ఫొటోలు దిగారు భామలు. తమ ఫొటోలను ఇంత అందంగా తీర్చిదిద్దిన ఫొటో గ్రాఫర్లకు హీరోయిన్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.
నామ్ ఫౌండేషన్ సెలబ్రిటీ క్యాలండర్ కోసం రవివర్మ చిత్రాల్ని మైమరిపిస్తూ అందాల హీరోయిన్లు సమంత, శ్రుతిహాసన్, ఐశ్వర్య రాజేశ్, రమ్య కృష్ణ, మంచు లక్ష్మి, ఖుష్బూ సుందర్ వంటి కొందరు ఈ ఫొటోల్లో ఇలా కనపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.