HomeTelugu Trendingమూడో పెళ్ళికి సిద్ధమైన హీరోయిన్?

మూడో పెళ్ళికి సిద్ధమైన హీరోయిన్?

3 17
నటి వనితా విజయకుమార్‌ మరోసారి పెళ్లికి రెడీ అయినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ సినిమాతో హీరోయిన్‌గ ఎంట్రీ ఇచ్చింది వనిత. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది. కాగా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే ఆయనతో మనస్పర్థల కారణంగా 2005లో విడాకులు తీసుకున్నారు.

ఆ తరువాత 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆ తరువాత ఆనంద్‌తోనూ విడాకులు తీసుకుంది. కాగా డాన్స్‌ మాస్టర్‌ రాబర్ట్‌తో వనిత కొంత కాలం సహజీవనం సాగించిందనే ప్రచారం నడిచింది. కాగా ఇటీవల బిగ్‌బాస్‌–3లో పాల్గొని వార్తల్లోకి ఎక్కిన ఈమె తాజాగా మూడో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఈ నెల 27న చెన్నైలోని తన ఇంటి వద్దే సింపుల్‌గా పీటర్‌ పాల్‌ అనే వ్యక్తితో వనిత వివాహం జరగనున్నట్లు పెళ్లి పత్రిక సహా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా ఆ విషయంపై వనిత తరఫు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

3a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu