HomeTelugu Trendingనిర్మాతపై మద్యం బాటిల్‌ విసిరిన నటి

నిర్మాతపై మద్యం బాటిల్‌ విసిరిన నటి

8 24
హీరోయిన్ సంజన, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ ల మధ్య కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక గొడవ ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరు రిచ్ మండ్ టౌన్ లో ఉన్న ఓ స్టార్ హోటల్ ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందట. ఈ సందర్భంగా వందనపై సంజన మద్యం బాటిల్ విసిరినట్టు కబ్బన్ పార్క్ పోలీసులకు వందన ఫిర్యాదు చేసింది. కాగా సినిమా రంగానికి చెందిన ప్రముఖుల జోక్యంతో రాజీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై తాజాగా సంజనా మాట్లాడుతూ వందనతో గొడవ జరిగిన మాట నిజమేనని… అయితే, అది చిన్నపాటి గొడవేనని చెప్పింది. గొడవకు సంబంధించి హోటల్ లో రాజీ చేసుకున్నామని తెలిపింది.

అయితే, వందనా జైన్ కు రూ. 200 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని సంజన డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. బెంగళూరులో వందనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, కానీ ఇక్కడ రూ. 200 కోట్ల ఆస్తులు ఉన్నాయని సంజన ఆరోపించింది. ముంబైలో 20 కోట్ల విలువ చేసే బంగళా ఉందని చెప్పిన సంజన ఆ బంగళా కూడా అక్రమమేనని చెప్పింది. ఇలాంటి వారు కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో విచారణ జరిపితే బయటపడుతుందని ఆమె ఆరోపించడం ఇప్పుడు సినిమా వర్గాల్లో సంచలనంగా మారింది. బుజ్జిగాడు మేడిన్ చెన్నై సినిమా ద్వారా టాలీవుడ్ రంగప్రవేశం చేసిన కన్నడ భామ సంజనా తెలుగుప్రేక్షకులకి సుపరిచితమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu