అంబానీ ఇంట్లో హీరోయిన్ రష్మికకు అవమానం

ఛలో సినిమాతో తెలుగు వారికి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‍గా పేరు తెచ్చుకుంది. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్ ద్వారా బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‍గా అవకాశాలు కొట్టేసింది. మిషన్ మజ్ను, గుడ్ బై వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. అలాగే తమిళంలో వారిసు సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

రష్మిక మందన్నా తాజాగా ముకేష్ అంబానీ ఇంట్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు హాజరైంది. ప్రతి ఏడాది అంబానీ ఇంట్లో జరిగే గణేష్ ఉత్సవాల్లో బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ స్టార్స్ పాల్గొంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది గణపతి వేడుకల్లో షారుక్ ఖాన్, అజయ్ దేవగన్, దిశా పటానీ, జాన్వీ కపూర్, ఖుషి కపూర్, శ్రద్ధా కపూర్‌తోపాటు సౌత్ నుంచి నయనతార, రష్మిక మందన్నా సందడి చేశారు.

రష్మిక మందన్నా నిల్చుని ఉంటే ఆమె వైపుకు సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ వచ్చింది. రష్మిక నవ్వుతో విష్ చేసినా శ్రద్దా కపూర్ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీంతో కొద్దిగా షాక్ అయిన రష్మిక.. పట్టించుకోలేదేంటీ అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రష్మిక మందన్నాను శ్రద్ధా కపూర్ పట్టించుకోకపోవడంపై ఆమె అభిమానులతోపాటు నెటిజన్లు మండిపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu