HomeTelugu Trendingనాని సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌!

నాని సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌!

Heroine Poorna
టాలీవుడ్‌ స్టార్ హీరో నాని న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ద‌స‌రా’. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి డెబ్యూ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా వ‌స్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరోయిన్ పూర్ణ కీలక పాత్ర చేస్తుందట‌. తాజాగా వచ్చిన అఖండ సినిమాలో ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించింది పూర్ణ‌.

అయితే ఈ సారి నాని చిత్రంలో మాత్రం నెగెటివ్ పాత్రలో క‌నిపించ‌బోతుంద‌ని టాక్ నడుస్తోంది. దీనిపై మేక‌ర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందేమో చూడాలి. కాగా పూర్ణ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్‌, స‌త్య‌న్ సూర్య‌న్ సంగీతం అందిస్తున్నారు. నాని ప‌క్కా తెలంగాణ పాత్రలో మాస్ లుక్‌లో మెరువ‌బోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu