హీరోయిన్ అంజలి తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అంజలి సౌత్ భాషలన్నింటిలో నటించింది. ఇప్పటివరకు ఈ భామ కెరీర్లో 48 సినిమాలు పూర్తి చేసుకుందట. త్వరలోనే 50 మూవీస్ మార్క్ అందుకోనుంది. ఈ మధ్య కాస్త అంజలి అవకాశలు కాస్త తగ్గాయి. తాజాగా ఓ మీడియా సమావేశంలో తన పర్సనల్ లైఫ్ గురించి తెలిపింది. తానిప్పుడు ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం మాత్రం బయటపెట్టింది. అయితే ఎవరితో రిలేషన్ లో ఉంది అనే విషయాలు మాత్రం సీక్రెట్ గానే ఉంచింది. ఏం చేస్తాం దురదృష్టం అందుకే ఆ రిలేషన్ షిప్ ఇంకా పరిపూర్ణం కాలేదని చెప్పుకొచ్చింది. సినిమాల కారణంగానే అది సాధ్యం కావడం లేదేమో అని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అంజలి దృష్టి మొత్తం తన ఫ్యూచర్ సినిమాలపైనే పెట్టిందట. తాజా అంజలి పవణ్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది.