HomeTelugu Big Storiesమనసు ఎంతగానో గాయపడింది: పూజా హెగ్డే

మనసు ఎంతగానో గాయపడింది: పూజా హెగ్డే

3 4చాలా యాక్టివ్‌గా ఉంటుంది. బాలీవుడ్‌తో పాటు.. టాలీవుడ్‌లోను వరుస ఆఫర్లతో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ… సామాజిక అంశాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది. తాజాగా మహారాష్ట్రంలో చెట్ల నరికివేత దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌‌గా మారింది. సోషల్ మీడియాలో చాలామంది చెట్ల నరికివేతపై మహా సర్కార్‌తో పాటు మోడీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పూజా హెగ్డే కూడా తన సోషల్ మీడియాలో ఈ అంశంపై స్పందించింది.

నా మనసు ఎంతగానో గాయపడింది. ఇది చాలా దారుణం. మన జీవనాధారం చెట్లని మనం ఎప్పుడు గ్రహిస్తాం? మెట్రో, పార్కింగ్ స్థలాలు చెట్ల కన్నా ముఖ్యమైనవి కాదు. హారిబుల్.. ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను కోడ్ చేస్తూ ఆమె ట్విట్టర్‌లో పూజా పోస్టు పెట్టింది.

ముంబైలో ఓ కాల‌నీలో అర్థరాత్రి చెట్లను నరికివేశారు. ముంబై మెట్రో.. ఓ కాలనీలో కార్ల షెడ్డును నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 3వేల భారీ వృక్షాల‌ను న‌రికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద్దంటూ వందలాది మంది పర్యావరణ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేసి అదుపులోకి తీసుకున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu