కోలీవుడ్ హీరో విశాల్ నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి, గెలుపొందాడు. తాజాగా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. గతంలోనే జయలలిత మృతి వల్ల ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి విశాల్ సిద్ధం అయ్యాడు. నామినేషన్ కూడా వేశాడు. అయితే నామినేషన్ ను ప్రతిపాదించిన 10 మందిలో కొంత మంది మద్దతును ఉపసంహరించుకోవడంతో… ఆ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ సిద్ధమవుతున్నాడు.
త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో చెన్నైలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని విశాల్ భావిస్తున్నాడు. దీనికి సంబంధించి తన అభిమాన సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నాడు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడో తెలియాల్సి ఉంది.