యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. తెలుగు ప్రేక్షకులకు కూడా విశాల్ సుపరిచితుడే. నడిగర్ సంఘం భవనం పూర్తయిన అనంతరమే పెళ్లి చేసుకునే ఆలోచనలో విశాల్ ఉన్నాడు. కానీ, కరోనా, ఆర్థిక కారణాలు, కోర్టు కేసులతో ఆ బిల్డింగ్ పనులు ముందుకు సాగడం లేదు. అనీషా అల్లారెడ్డితో 2019లో ఈ స్టార్ హీరోకు నిశ్చితార్థం అయింది. ఏమైందో తెలియదు కానీ ఆరునెలల అనంతరం వారు విడిపోయారు.
కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్‌తో విశాల్ రిలేషన్ షిప్ కొనసాగించాడని గతంలో వార్తలు వినిపించాయి. విశాల్ తాజాగా ప్రేమపై తనకున్న అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. పెద్దలు కుదిర్చిన వివాహం తనకు సరిపోదని తెలిపాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. ఆమెకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నాడు. ఇక కెరీర్ విషయనికి వస్తే.. విశాల్ ప్రస్తుతం ‘లాఠీ’, ‘మార్క్ ఆంటోనీ’ సినిమాల్లో నటిస్తున్నాడు. ‘తూప్పరివాలన్-2’ సినిమాతో విశాల్ దర్శకుడిగా కూడా మారబోతున్నాడు.