తమిళ నటుడు విజయ్ ప్రస్తుతం ‘వారసుడు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతుంది. కాగా హీరో విజయ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుమారుడిని ఎత్తుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విజయ్ షూటింగ్ బ్రేక్ టైమ్‌లో దిల్ రాజు ఇంటికెళ్లినపుడు ఇలా కనిపించగా.. అక్కడే ఉన్న కెమెరాలు ఆ దృశ్యాన్ని క్లిక్‌మనిపించాయి. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు దిల్ రాజు కుమారుడిని చూసిన నెటిజన్లు.. ఎంత ముద్దుగా ఉన్నాడో అని అంటున్నారు.
వారసుడు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. వారసుడు మూవీలో ఖుష్బూ సుందర్, శరత్ కుమార్, జయసుధ, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.