తలపతి విజయ్ కు తమిళనాడులో ఏ రేంజ్ లో పేరు ఉన్నదో చెప్పక్కర్లేదు. సౌత్ లో 200 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. అంతకు ముందు ఈ ఫీట్ ను సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాహుబలి సినిమాలు మాత్రమే సొంతం చేసుకున్నాయి. కాగా, సర్కార్ సినిమా కూడా అదే రేంజ్ లో వసూళ్లు సాధించింది. 200 కోట్ల రూపాయల మార్కెట్ ను సొంతం చేసుకుంది.
సర్కార్ సినిమా వరకు రూ. 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరో, ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ ను 40శాతం పెంచేశాడు. బిగిల్ సినిమాకు రూ. 40 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా విజయ్ నిలవడం విశేషం. దీపావళి సందర్భంగా ఈనెల 27 వ తేదీన చిత్రం విడుదల కాబోతున్నది.