టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి రెండో కుమార్తె హవ్యవాహిని పెళ్లి.. నిన్న (శుక్రవారం)హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్ తో కలిసి హవ్యవాహిని వివాహం జరిగింది. రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వివాహ వేడుక జరుగాయి.
ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో హవ్యవాహిని నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నాగ చైతన్య, దగ్గుబాటి రానా, సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
వెంకటేష్‌కు నలుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు ఒక కొడుకు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల క్రితం 2019లో జరిగింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటూ ఇన్ఫినిటీ ప్లాటర్ అనే ఫుడ్‌కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది.