ఎఫ్2, వెంకీమామ సినిమాల విజయాలతో మంచి జోరుమీదున్న విక్టరీ హీరో వెంకటేశ్ మరో చిత్రంలో నటించబోతున్నారు. రీమేక్ చిత్రాల ద్వారా హిట్స్ అందుకోవడంలో స్పెషలిస్టు వెంకటేశ్. తాజాగా ఈ హీరో నటిస్తున్న మరో చిత్రం ‘అసురన్’. ఈ నెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం అక్కడ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టింది. అందుకే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సురేశ్‌ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకటేశ్ సోదరుడు సురేశ్‌బాబు ఈ సినిమా నిర్మాణం చేపడుతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియమణిని హీరోయిన్గా ఎంపిక చేశారు.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మరో యువ హీరో కోసం దర్శక, నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. వెంకటేశ్ పక్కా పల్లెటూరి మాస్ యాంగిల్లో కనిపించబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాయలసీమ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ దాదాపు 30 రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నారట. సినిమా మొత్తం దాదాపు రెండు నెలల్లో పూర్తి చేసి వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.