టాలీవుడ్ నటుడు తరుణ్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెగా ఇంటికి అల్లుడు అంటూ రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇవి తారా స్థాయికి చేరుకోవడంతో హీరో స్పందించాడు.. ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు.
తరుణ్ సినిమాల విషయానికి వస్తే బాలనటుడిగా తరుణ్ ఎన్నో సినిమాలలో నటించాడు. 2000లో విడుదలైన ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2018లో విడుదలైన ‘ఇది నా లవ్ స్టోరీ’ లో చివరిగా కనిపించాడు. ఈ తర్వాత ఆయన సినిమాలలో కనిపించలేదు.