తమిళ స్టార్ హీరో సూర్యకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఆయనకు గాయాలయ్యాన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుధ కొంగర డైరెక్షన్‌లో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ఆ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఆయన భార్య జ్యోతిక హీరోయిన్‌గా నిర్మించిన పొన్‌మగళ్ వందాళ్ చిత్రం ఈ నెల 29న ఓటీటీలో విడుదల కానుంది. లాక్‌డౌన్ కాలంలో సూర్య వర్కవుట్ చేస్తుండగా గాయాలు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ విషయంపై సూర్య స్పందించలేదు. ఆయన బంధు వర్గాలను విచారించగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగతున్నట్లు పెద్దగా గాయాలేమీ కాలేదని వివరించారు. ఇటీవల వర్కవుట్ చేస్తుండగా ఆయన ఎడమ చేతికి గాయమైందన్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు సూర్య చేతి గాయం 90 శాతం నయమమైందని చెప్పారు. లాక్ డౌన్ పూర్తి కాగానే హరి దర్శకత్వంలో అరువా చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.