టాలీవుడ్ యంగ్ హీరో, ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో అతని వివాహం నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. కాగా ఇప్పటికే మోహింది ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.