ఇప్పుడున్న సీనియర్ హీరోలతో పోటీపడి హీరోగా స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయిన స్టార్ సుమన్. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి మంచి సినిమాలు చేసిన సుమన్ రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సుమర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెటింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి సుమన్ మాట్లాడారు.
డాన్స్ విషయానికొస్తే చిరంజీవిగారి డాన్స్ బాగా ఇష్టపడుతాను అని ఇండస్ట్రీ మొత్తం మీద నేల చూడకుండా డాన్స్ చేసే స్టార్ చిరంజీవిగారు మాత్రమే అన్నారు సుమన్. అంతే కాదు ఆయన డాన్స్ చేసేటప్పుడు ఆయన బాడీలో ఒక రిథమ్ ఉంటుంది .. ఒక గ్రేస్ ఉంటుంది. . చాలా మంది కుర్రాళ్లు ఇప్పుడు అంతకంటే ఫాస్టుగా చేస్తున్నారు కానీ వాటిలో డాన్స్ కంటే కూడా జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్నారు. ఇక చిరంజీవి తరువాత అంత బాగా డాన్స్ చేసే హీరోగా ఎవరికి ఎక్కవు మార్కులు ఇస్తారు అంటే.. ఇప్పడు ఉన్న యంగ్ స్టార్స్ లో మెగాస్టార్ తరువాత అంతలా డాన్స్ చేసేది ఎన్టీఆర్ ఉంది అన్నారు. ఇక ఇవే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా విషయాలు పంచుకున్నారు సుమన్.