HomeTelugu Trending30 కిలోల బరువు తగ్గిన యంగ్‌ హీరో

30 కిలోల బరువు తగ్గిన యంగ్‌ హీరో

Hero simbu shocks with hisహీరో శింబుకు తమిళనాట లిటిల్ సూపర్ స్టార్‌గా మంచి పేరుంది. దాంతో పాటు ఎఫైర్స్ కింగ్ అనే పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈయన తన మేకోవర్‌తో అందరికీ షాకిచ్చాడు. ఈ మధ్య చాలా బొద్దుగా కనిపించిన శింబు.. ఇప్పుడు మెరుపుతీగలా మారిపోయాడు. 101 కేజీల బరువు నుంచి 70 కేజీలకు తగ్గి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. తాజా ఫోటోలు చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది కేవలం సినిమాల కోసం కాకుండా తాను వ్యక్తిగతంగా అనుకుని చేసాడు శింబు. తనను తాను నిరూపించుకోడానికి ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాడు శింబు. ఇదే విషయం అభిమానులకు కూడా చెప్పాడు ఈయన. శింబు నటిస్తున్న ‘ఈశ్వరన్’ మూవీ సంక్రాంతి ప్రేక్షకుల ముందుగా రావడానికి రెడీగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu