బెంగళూరులో నటుడు సిద్ధార్థకు నిరసన సెగ

 

హీరో సిద్ధార్థ తన సినిమా చిత్త (కన్నడంలో చిక్కు) ప్రచారం కోసం బెంగళూరు వెళ్లారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం ప్రారంభించడానికి ముందు కన్నడ అనుకూల సంస్థల సభ్యులు సిద్ధార్థ కార్యక్రమానికి ఆటంకం కలిగించారు. కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కొనసాగుతున్నా సరే సిద్ధార్థ మాట్లాడడం కొనసాగించాడు.

తమ కావేరీ ఉద్యమానికి మద్దతు తెలపాలని నిరసనకారులు సిద్ధార్థను డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రక్తంగా మారింది. సిద్ధార్థ్ వెనుక ఉన్న పోస్టర్లను చించేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీంతో సిద్ధార్థ చేతులు జోడించి అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది అభిమానులు సిద్ధార్థ్‌కు మద్దతుగా కామెంట్స్ చేశారు. ఆందోళనకారుల పిరికి చర్య ఇది అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ ఘటనపై సిద్ధార్థ్ ఏమీ స్పందించలేదు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే కరువు కోరల్లో చిక్కుకోగా కావేరీ నుంచి తమిళనాడుకు నీళ్లు వదలాల్సిందేనన్న కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాలు రెండు
రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు పెట్టాయి.

దీంతో కర్ణాటకలోని మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్‌ ద్వారా సిద్ధార్థకు క్షమాపణలు తెలిపారు. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ సమస్య దశాబ్దాలుగా ఉందని, ఇన్నేళ్ల కాలంలో
సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదని, సమస్య పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని కుంటి ఎంపీలను ప్రశ్నించకుండా నిస్సహాయ సామాన్యులను, కళాకారులను చిత్రహింసలకు గురిచేయడం తప్పని, అందుకు కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu