టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నారై అమ్మాయిని శర్వా పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్. శర్వాకు కాబోయే భార్య అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోందని అంటున్నారు. అమెరికాలో జాబ్ అయినప్పటికీ… కరోనా ప్రభావం కారణంగా ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారట.
ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తెలంగాణకు చెందిన యువతి అని ఫిలింనగర్ టాక్. కొన్నాళ్లుగా ఆ అమ్మాయితో శర్వానంద్ ప్రేమలో ఉన్నాడని చెపుతున్నారు. ఈ వేసవిలో వీరి పెళ్లి జరగనున్నట్లు వినికిడి. తన పెళ్లికి సంబంధించి శర్వానంద్ నుంచిఅధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది.