ప్రముఖ సీనియర్ నటుడు తన కూతురు ఐశ్వర్యతో తమిళ .. కన్నడ భాషల్లో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే అర్జున్ తెలుగులోను ఆమెను పరిచయం చేయడానికి రంగంలోకి దిగారు. ఈ సినిమాలో విష్వక్సేన్ ను హీరోగా తీసుకున్నారు. కొంతవరకూ షూటింగు నడిచిన తరువాత తేడా వచ్చేసింది. విష్వక్ తీరు పట్ల అర్జున్ అసహనాన్ని ప్రదర్శించడమే కాకుండా, మరో హీరోతో ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుని వెళ్లనున్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.
తెలుగుతో తన కూతురు ఫస్ట్ సినిమా కావడంతో అర్జున్ కి ఈ సినిమా సెంటిమెంట్. అందువలన ఆయన దీనిని ఆపేసే ఆలోచనలో లేరు. పైగా తాను పని ఇస్తానని చెప్పి తీసుకొచ్చిన ఏ టెక్నీషియన్ ను కూడా పని లేదని చెప్పి వెనక్కి పంపించడం తనకి అలవాటు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అందువలన సాధ్యమైనంత త్వరగా మరో హీరోతో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.
ఈ కథకి శర్వానంద్ కరెక్టుగా సరిపోతాడని భావించిన ఆయన, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ మొదటి నుంచి కూడా చాలా కూల్ గా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. చాలా కాలం తరువాత ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ఆయన హిట్ అందుకున్నాడు. అలాంటి శర్వానంద్ ను అర్జున్ ఎంతవరకూ ఒప్పించగలుగుతారనేది చూడాలి.