టాలీవుడ్ హీరో శర్వానంద్ తండ్రి కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ హైకోర్టు న్యాయవాది కుమార్తె అయిన రక్షితారెడ్డిని శర్వానంద్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో వీరి ఎంగేజ్ మెంట్ జరగ్గా, జూన్ లో వివాహ వేడుక జరిగింది. వీరి పెళ్లికి అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
మరోవైపు రక్షిత ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అక్కడే రెగ్యులర్ గా చెకప్ లు కూడా చేయించుకుంటున్నారు. భార్యకు తోడుగా ఉండేందుకు శర్వా అమెరికాకు వెళ్లినట్టు టాక్. డెలివరీ అయితే తర్వాతే మళ్లీ హైదరాబాద్ కు రానున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై ఇంత వరకు శర్వానంద్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించలేదు.
ఇక సినిమాల విషయాన్నికి వస్తే.. శర్వానంద్ 35వ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో… ఇతర సినిమాలకు చిన్ని బ్రేక్ ఇచ్చి ఆయన అమెరికాకు వెళ్లిపోయాడు.