HomeTelugu Big Storiesరానా-మిహికా పెళ్లి తేది ఫిక్స్‌..

రానా-మిహికా పెళ్లి తేది ఫిక్స్‌..

2 30
టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి .. మిహిక బజాజ్ తో ప్రేమలో ఉన్నాడు.. కాగా ఇద్దరి ప్రేమను ఇరు వైపులా అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అయితే ఈ నెల 21న రానా,మిహికా బజాజ్ రోకా ఫంక్షన్‌ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే రానా తండ్రి సురేష్ బాబు వారిద్దరి పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుంది అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆగష్టు 8న రానా-మిహికా పెళ్లి జరుగుతుంది సమాచారం. అయితే ప్రస్తుతం మన దగ్గర కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో కొద్ది మంది బంధువులు మధ్యే ఈ పెళ్లి చేసుకుంటారా… లేక విదేశాలలో జరుపుతారు అనేది తెలియదు. దినిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu