HomeTelugu Big Storiesజూనియర్‌ ఆర్టిస్టుపై అత్యాచారం ..వర్థమాన నటుడు అరెస్ట్‌

జూనియర్‌ ఆర్టిస్టుపై అత్యాచారం ..వర్థమాన నటుడు అరెస్ట్‌

hero priyanth rao arrested

వర్థమాన నటుడు ప్రియాంత్‌ రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రేమ పేరుతో వచించి అత్యాచారం చేశాడు అంటూ.. ప్రియాంత్‌ పై ఓ మహిళా జునియర్‌ ఆర్టిస్టు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడు అని ఆ ఫిర్యాదులో పేర్కొంది. పరారిలో ఉన్న ప్రియాంత్‌ని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరిలించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రియాంత్‌. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ జూనియర్‌ ఆర్టిస్టుతో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి మోసం చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చగా.. ఆ నటుడు మెహం చాటేశాడు. అంతేకాక అబార్షన్‌ కోసం టాబ్లెట్స్‌ ఇవ్వగా.. ఆమె ఆరోగ్యం పాడైంది. ఈ విషయం బయటకు చెబితే..చంపేస్తాను అని బెదిరించాడు. ప్రాణ భయంతో ఆమె జులై9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారిలో ఉన్న ప్రియాంత్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!