HomeTelugu Trendingపెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌!

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌!

5 16
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా దుబాయ్‌లో ఏప్రిల్ 16నే ఆయన పెళ్లి చేయాలని కుటుంబ స‌భ్యులు అనుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోనే నిర్వహించాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

కాగా, ఆయన పెళ్లి ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. డిసెంబరు నాటికి కూడా కరోనా పూర్తిగా అదుపులోకి రాని అవకాశాలు కనపడుతుండడంతో తమ ఫాంహౌస్‌లోనే నితిన్ త‌న పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. తన ప్రేయసి శాలినితో నితిన్ నిశితార్థం కొన్ని నెలల క్రితమే జరిగింది. ప్రస్తుతం నితిన్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu