కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా అనేక వివాహాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. హీరో నితిన్ వివాహం కూడా వాయిదా పడింది. ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్లో నితిన్, శాలిని వివాహం జరగబోతుంది. కరోనా నిబంధనలను అనుసరించి తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. నితిన్ వివాహానికి
ఇరు కుటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు, స్నేహితులు కొంతమంది మాత్రమే హాజరుకాబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, శాలిని ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసింది. ఏప్రిల్ నెలలో కావాల్సిన వివాహం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాలు చేస్తున్నాడు. తర్వాత ‘అంధాధున్’ రీమేక్, ‘పవర్ పేట’ సినిమాలు చేయబోతున్నాడు.