HomeTelugu Trendingనితిన్‌కి కరోనా సెగ.. పెళ్లి వాయిదా!

నితిన్‌కి కరోనా సెగ.. పెళ్లి వాయిదా!

9 26
కరోనా ఎఫెక్ట్‌ .. హీరో నితిన్ పెళ్లికి పై కూడా పడింది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే సినిమాలు వాయిదా పడుతున్నాయి.. షూటింగ్స్ ఆపేస్తున్నారు.. ఇప్పుడు నితిన్ పెళ్లి కూడా వాయిదా పడింది. నాగర్‌ కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్‌ హోమ్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఈ మధ్యే నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది.

వీరిద్దరు త్వరలో దుబాయ్‌లోని హోటల్ పలాజో వర్సాచీలో ఏప్రిల్‌ 16న పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనికి ఏర్పాట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పెళ్లి కొన్ని రోజులు వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ కన్ఫర్మ్ చేసాడు. మార్చ్ 30న ఈయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా తన పుట్టిన రోజు వేడుకలు జరపొద్దని అభిమానులను కోరాడు. తన పెళ్లి కూడా ఎప్రిల్ 16 నుంచి వాయిదా వేసుకున్నట్లు తెలిపాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu