HomeTelugu Big Storiesహీరో 'నిఖిల్- పల్లవి' వెడ్డింగ్‌ టీజర్‌

హీరో ‘నిఖిల్- పల్లవి’ వెడ్డింగ్‌ టీజర్‌

12 13

టాలీవుడ్‌ హీరో నిఖిల్, పల్లవి వర్మల వివాహం లాక్‌డౌన్‌ కారణంగా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో… హైదరాబాద్‌ శివారులోని ఓ రిసార్ట్‌లో జరిగింది. కరోనా కారణంగా .. అభిమానులు పెళ్లిని నేరుగా చూసే అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ద్వారా తన పసుపు ఫంక్షన్‌, పెళ్లి ఫొటోలు షేర్‌ చేసిన నిఖిల్‌.. తాజాగా తన వెడ్డింగ్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు.‘ప్రతీ ఒక్కరు నా పెళ్లికి రావాలని కోరుకున్నాను. కానీ లాక్‌డౌన్‌ వల్ల ఈ వీడియో ద్వారా మాత్రమే మీ ఆశీర్వాదాలు పొందగలనని ఆశిస్తున్నాను. నా ఫేవరెట్‌ సాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది’’ అంటూ తన జీవితంలో మధుర జ్ఞాపకాలకు సంబంధించిన దృశ్యాలు అభిమానులతో పంచుకున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu