టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడే పిల్లల కోసం ఆలోచించేస్తున్నాడు. పెళ్లయ్యాక తండ్రి కావడం అనేది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి కావాల్సిందే కదా. కాబట్టి ఆ నిజాన్ని ముందే చెప్పి తమకు పుట్టబోయే బిడ్డ పేరును కూడా బయటపెట్టేశాడు. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్న నిఖిల్ చాలా విషయాలు ఓపెన్‌గా మాట్లాడాడు. తాజాగా ఈ షో ప్రోమో వీడియోలో నిఖిల్ చెప్పిన సంగతులు ఆసక్తి కలిగిస్తున్నాయి.
పెళ్లి జరిగి కొన్ని నెలలే అవుతుంది అప్పుడే పాప పేరు పెట్టేశారట ఏంటి సంగతి.. ఏమైనా గుడ్ న్యూస్ చెప్పేస్తారా? అని అలీ అంటిస్తూ ఓ ప్రశ్న వేశాడు. దీనిపై స్పందించిన నిఖిల్.. పల్లవిని కలిసిన తొలి రోజుల్లోనే నా కూతురు పేరు ‘మాయ’ అనుకుంటున్నా నీకు ఓకేనా అని అడిగాను. ఆమె కూడా నీ ఇష్టం అని చెప్పిందని చెప్పాడు. మరి కొడుకు పుడితే ‘మాయలోడు’ అని పెడతావా? అంటూ దీనిపై మరో కౌంటర్ వేశాడు అలీ.
హీరోగా కావడం కోసమే ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యానని చెప్పిన నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ సినిమా అప్పుడు ఆఖరికి సూట్ కేసులు కూడా మోశానని చెప్పాడు. అలాగే తనకు పవన్ కళ్యాణ్, రవితేజ స్టైల్ అంటే ఇష్టమని, ఆ హీరోలనే ఎక్కువగా ఫాలో అవుతుంటానని చెప్పారు.