HomeTelugu NewsHero Nikhil: మా మొదటి బిడ్డ అతి త్వ‌ర‌లోనే రాబోతుంది: నిఖిల్‌

Hero Nikhil: మా మొదటి బిడ్డ అతి త్వ‌ర‌లోనే రాబోతుంది: నిఖిల్‌

Hero Nikhil shares his wife

Hero Nikhil: టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న నిఖిల్‌ మాత్రం స్పందించలేదు. తాజాగా ఈ విష‌యాన్ని నిఖిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టిం చాడు. తనభార్య ప‌ల్ల‌వి సీమంతం ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

‘మా మొదటి బిడ్డ అతి త్వ‌ర‌లోనే రాబోతుంది. ప‌ల్ల‌వి..నేను ఎంతో సంతోషంగా ఉన్నాం. మీ అంద‌రి దీవెన‌లు మాకు అవ‌స‌రం’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు ఆ దంప‌తుల‌కు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. 2020లో నిఖిల్‌- పల్లవిల పెళ్లి జరిగింది. లాక్‌డౌన్ కారణంగా నిరాడంబరంగా కేవలం కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది.

ప్ర‌స్తుతం నిఖిల్ ‘స్వ‌యంభు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాలో నిఖిల్‌ యుద్ధ వీరుడుగా కనిపించనున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత బజ్‌ని క్రియేట్‌ చేశాయి.

271685 nikhil

Recent Articles English

Gallery

Recent Articles Telugu