కరోనా మహ్మమారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిపోతున్నాయి. అయితే ఈ వైరస్ కారణంగా చాల దేశాలు లాక్డౌన్ విధించాయి. ఈ వైరస్ ప్రభావం మన భారత్ లో కూడా బాగానే కనిపిస్తుంది. అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడంలో క్రికెటర్లు, సెలబ్రెటీలు అందరూ తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ వైరస్ కారణంగా అని సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. అయితే హీరో నిఖిల్ ..చైనా ఈ వైరస్ ను కావాలనే వ్యాప్తి చేసిందని అంటున్నాడు. ఈ విషయానికి సంబంధించి తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసాడు.
అందులో… “జనవరిలో చైనా వుహాన్ నుండి మిగతా చైనాకు దేశీయంగా ప్రయాణాన్ని త్వరగా నిలిపివేసింది, కాని వుహాన్ నుండి అంతర్జాతీయ విమానాలను ఆపలేదు. చైనా ఎందుకు వూహాన్ నుండి అంతర్జాతీయంగా ప్రయాణించటానికి అనుమతించింది?” అని అన్నాడు. చైనా కావాలనే కరోనా వైరస్ ను ప్రపంచమంతా వ్యాప్తి చేసింది అని తెలిపాడు. చైనా లోని వుహాన్ నగరంలో ఓ ల్యాబ్ లో కరోనా వైరస్ ను కావాలనే తయారు చేసారు అనే వార్తలు కూడా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో మాత్రం తెలియదు.
Finally! Evidence is piling up for the Cover Up we all knew happened.
“In January China quickly shut down travel domestically from Wuhan to the rest of China, but did not stop international flights from Wuhan” Why did China do this nd let ppl travel international from Wuhan? https://t.co/4Y8mnToIK4
— Nikhil Siddhartha (@actor_Nikhil) April 16, 2020