టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రయ్యాడు. ఈరోజు ఉదయం తన భార్య పల్లవి పండంటి మడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను ఎత్తుకుని ముద్దడుతున్న నిఖిల్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సెలబ్రెటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
త్వరలోనే తాము తమ మొదటి బిడ్డకు జన్మను ఇవ్వబోతోన్నట్టుగా నిఖిల్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ సంప్రదాయ ప్రకారం సీమంతం వేడుకలు జరుగుతున్నాయని, త్వరలోనే తండ్రిని కాబోతోన్నట్టుగా చెప్పుకొచ్చాడు.
పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభు’ మూవీ చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమా కోసం గుర్రుపు స్వారీలు కూడా నేర్చుకుంటున్నాడు. బాడీని పెంచేశాడు. జుట్టు పొడుగ్గా పెంచుకుంటున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ ఫుల్ స్వింగులో ఉన్నట్టుగా తెలుస్తోంది.