టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ’18 పేజెస్’. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో నిఖిల్ ‘బిగ్బాస్..గ్రాండ్ ఫినాలే’ కి వెళ్లి వచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాలను గురించి నిఖిల్ ప్రస్తావించాడు.
’18 పేజెస్’ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ కి వెళ్లాను. నేను హౌస్ లోకి వస్తాను .. కాసేపు మాట్లాడి అందరికీ హాయ్ చెప్పేసి వెళ్లిపోతానని అనుకున్నారు. కానీ టాప్ ఫైవ్ లో నుంచి ఒకరిని నాతో పాటు బయటికి తీసుకుని రావలసి వచ్చింది. రోహిత్ ను నాతో పాటు తీసుకుని వచ్చేశాను” అన్నాడు.
” బిగ్ బాస్ స్టేజ్ పైకి వెళ్లి నాగార్జునగారితో మాట్లాడుతున్నంత సేపు చాలా హ్యాపీగా అనిపించింది. హౌస్ లోకి వెళితే అదో జైలు మాదిరిగా అనిపించి టెన్షన్ వచ్చేసింది. పాపం .. అందులో 105 రోజులు వాళ్లు ఉన్నారంటే సామాన్యమైన విషయమేం కాదు” అంటూ చెప్పుకొచ్చాడు.