టాలీవుడ్ లో ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ చంద్ర. ఈ సినిమా తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించినా ఆశించిన ఫలితం రాకపోవడంతో వచ్చిన అవకాశాలను అందుకొని విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారిపోయాడు. మధ్యలో అడపాదడపా హీరోగా మారుతున్నాడు. ఇక ఇప్పటివరకు సింగిల్ గా ఉన్న నవీన్ చంద్ర ప్రేమికుల రోజున తన భార్యను పరిచయం చేశాడు.
‘ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్ ఓర్మా’ అంటూ భార్య తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు నవీన్ చంద్ర సింగిల్ అనుకున్నవారందరు ఈ ఫొటో చూసి షాక్ అవుతున్నారు. మరికొందరు ప్రేమికుల రోజు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నవీన్ చంద్ర పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.