‘ఆర్‌ఎక్స్ 100’ తో సెన్సేషన్ క్రియేట్‌చేసిన నటుడు కార్తికేయ. రెండో చిత్రం ‘హిప్పీ’ సినిమాతో నిరాశపరిచాడు. అయితే మళ్లీ ‘గుణ 369’అంటూ ప్రయత్నించినా.. సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
పాలసీసాలో కూడా మందును పోసినట్టు డిజైన్‌చేసి రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని రేకిత్తించగా.. కాసేపటి క్రితమే ఫస్ట్ లుక్, టైటిల్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ చూస్తుంటే మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.