హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్ వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగిన వీరి వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ నేపథ్యంలో నిన్న (బుధవారం) రాత్రి వారి వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్నేహితులు, సన్నిహితులు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్‌కు తెలుగు సినీ ప్రముఖులతో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా హజరయ్యారు. కళ్లు చెదిరే అరెంజ్‌మెంట్స్‌తో వీరి రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ఆది సాయికుమార్, రాహుల్ రవీంద్రన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తుంది.