దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ల్లో పలువురు స్టార్స్ ఈ మహమ్మారి బరిన పడ్డారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీని కూడా ఈ వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా ప్రముఖ కన్నడ హీరో ధృవ్ సర్జా, ఆయన భార్య ప్రేరణ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ధృవ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని , ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నామని, త్వరలోనే కోలుకుంటామని అన్నారు. అలానే కరోనా లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని దానిద్వారా మన చుట్టూ ఉన్నవాళ్లకు కరోనా సోకకుండా ఉంటుందని ధృవ్ సూచించారు.