టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘మేజర్’. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నిన్న శుక్రవారం విడుదలైన పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా రాణిస్తుంది. శశికిరణ్ తిక్కా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అడివి శేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ మూవీయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మేకర్స్ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో అడివిశేష్ మాట్లాడుతూ.. ‘ఆర్మీలో చేరాలనుకునే యువతకు మద్ధతిస్తాం. ఎలా మద్ధతిస్తాం అనేది త్వరలో చెబుతా. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మొదట 10 మంది యువతతో స్టార్ట్ చేస్తాం. అది ఎంత మందికి చేరుతుందనేది తెలియదు’ అంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దీనిపై పలువురు నెటిజన్లు గొప్ప పని చేస్తున్నావు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. శోభితా ధూళిపాల కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఏయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.