HomeTelugu Big StoriesPrabhas: మదురై వెళ్లనున్న ప్రభాస్.. అందుకేనా?

Prabhas: మదురై వెళ్లనున్న ప్రభాస్.. అందుకేనా?

Here's why Prabhas is planning a trip to Madhurai
Here’s why Prabhas is planning a trip to Madhurai

Prabhas Movie Shooting:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా ప్రభాస్ చేతిలో ఇంకా బోలెడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్న ప్రభాస్ నెక్స్ట్ ఏ సినిమా షూటింగ్ మొదలు పెడతారు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం రాజా సబ్ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజు నెలలోనే పూర్తి కాబోతోంది. ఆ తర్వాత కల్కి 2 కూడా త్వరలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో పట్టాలెక్కనుంది. వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక అందమైన ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

కెరియర్ లో మొదటిసారిగా ప్రభాస్ ఈ సినిమాలో ఒక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి ఫౌజీ అనే ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వరకు పూర్తయిపోయాయి. ప్రభాస్ డేట్లు ఇవ్వడం ఆలస్యం షూటింగ్ మొదలు అయిపోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఆగస్టు 17న హైదరాబాద్లో జరగబోతోంది.

ఆ తర్వాత రోజే అంటే ఆగస్టు 15 నుంచి మూడు వారాల పాటు మదురై లో.. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుందట. హను రాఘవపూడి మూడు వారాలలో సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. అందులో ప్రభాస్ ఆగస్టు 22 నుంచి 15 రోజులు పాటు షూటింగ్లో పాల్గొనబోతున్నారు.

అటు రాజా సాబ్ సినిమా షూటింగ్ తో పాటే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు. ఇలా ప్రభాస్ ఒక్క సినిమా తర్వాత మరొక సినిమా అంటూ.. షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu