Kiara Advani is not promoting Game Changer:
కియారా అద్వానీ ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌లో కనపడటం లేదు. ఆమె హిందీ ప్రమోషన్స్ మాత్రమే చేస్తున్నారు కానీ రామ్ చరణ్ లాగా ప్రమోషన్స్ కోసం టైమ్ కేటాయించడంలేదు. సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కినా, ప్రమోషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం టాప్ పేమెంట్ తీసుకునే హీరోయిన్‌గా నిలిచింది. వరుస బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న కియారా, రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. కానీ ఆమె ప్రమోషన్లకు మాత్రం సమయం కేటాయించలేకపోయింది.
కియారా ఇటీవల ఒక్కరోజు మాత్రమే హిందీ ప్రమోషన్స్‌కు సమయం కేటాయించింది. ముంబైలో సల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్’ షోలో పాల్గొని, ‘ది కపిల్ శర్మ షో’ లో కూడా కనిపించింది. తర్వాత ఆమె దక్షిణాది ప్రమోషన్లకు మళ్లీ సమయం కేటాయించలేదు.
View this post on Instagram
ఇక రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈరోజు రాజమండ్రిలో పాల్గొంటారు. మరుసటి రోజు చెన్నైలో ప్రచార కార్యక్రమానికి వెళ్లనున్నారు. జనవరి 6న బెంగళూరులో ప్రెస్ మీట్ కూడా జరగనుంది. ఈ అన్ని ఈవెంట్స్‌కు కియారా హాజరు అయ్యే పరిస్థితి లేదు.
ప్రత్యేకంగా రామ్ చరణ్ కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు. తెలుగు మీడియాలో ఇంతవరకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. పత్రికా సమావేశాలు, మీడియా ఇంటరాక్షన్స్ కూడా మిస్ అయ్యారు. అందుకే ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్ వేరే సినిమాలతో పోలిస్తే కొంచెం డల్‌గా ఉన్నాయన్నది ఇండస్ట్రీలో టాక్. భారీ బడ్జెట్ సినిమా అయినా, ప్రమోషన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం అభిమానుల్లో కొంత నిరాశ కలిగిస్తోంది.
ALSO READ: Pushpa 2 సినిమా ఓటిటి లో ఎప్పుడు విడుదల అవుతుంది అంటే!