HomeTelugu TrendingBandla Ganesh త్రివిక్రమ్ కి ఎందుకు క్షమాపణలు చెప్పారు?

Bandla Ganesh త్రివిక్రమ్ కి ఎందుకు క్షమాపణలు చెప్పారు?

Here's why Bandla Ganesh apologised to Trivikram
Here’s why Bandla Ganesh apologised to Trivikram

Bandla Ganesh about Trivikram:

ప్రముఖ కమెడియన్, నిర్మాత అయిన Bandla Ganesh కి పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. మరోవైపు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే. కానీ ఒక సమయంలో బండ్ల గణేష్, త్రివిక్రమ్‌పై కోపంతో అసభ్య పదజాలం వాడి మరీ తిట్టిపశారు. ఆ తర్వాత తన తప్పును గ్రహించి త్రివిక్రమ్‌కు క్షమాపణ చెప్పారు.

గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన గణేష్, త్రివిక్రమ్‌ను దూషించినందుకు బాధపడ్డానని తెలిపారు. “కోపంగా ఉన్న సమయంలో అలా జరిగింది. వెంటనే త్రివిక్రమ్ గారికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాను,” అని బండ్ల గణేష్ వెల్లడించారు.

ఈ సందర్భంలో బండ్ల గణేష్, తాను హిందీ చిత్రం దబాంగ్ రీమేక్ హక్కులు కొనుగోలు చేసినప్పుడు త్రివిక్రమ్ తనను ఎంత ప్రోత్సహించారో కూడా గుర్తుచేసుకున్నరు. “నేను దబాంగ్ హక్కులు తీసుకున్నప్పుడు, త్రివిక్రమ్ గారు నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. త్రీన్మార్ సమయంలో ఆ హక్కులు తీసుకున్నాను. పవన్ గారు ఈ సినిమా నేను చేయాలని అనగానే త్రివిక్రమ్ గారు అభినందించారు,” అని గణేష్ చెప్పారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన తీన్ మార్ సినిమా కూడా మళ్ళీ రీ రిలీజ్ చేయాలని గణేష్ ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. “పవన్ గారి ఫ్లాప్ సినిమా కూడా రీ-రిలీజ్ అయితే ఎలా హిట్ అవుతుందో చూపించాలనుకుంటున్నాను” అని బండ్ల గణేష్ తన అభిప్రాయం వ్యక్తం

చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu