Sookshmadarshini OTT release date:
Sookshmadarshini అనే మలయాళ మిస్టరీ థ్రిల్లర్ కొత్త సంవత్సరంలో జీ5 ఓటిటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఎంసీ జితిన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బసిల్ జోసఫ్, నజ్రియా నజీమ్ ముఖ్య పాత్రలు పోషించారు. నాలుగేళ్ల విరామం తర్వాత నజ్రియా మలయాళ చిత్రసీమలోకి తిరిగి వచ్చిన సినిమా ఇదే కావడం విశేషం.
₹10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో ₹55 కోట్లకుపైగా వసూలు చేసి 2024 సంవత్సరానికి మలయాళ సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
#Sookshmadarshini Post theatrical deals closed with Zee.
OTT – Zee 5
Satellite – Zee Keralam pic.twitter.com/hltGEZOCUh— Heyopinions (@heyopinionx) December 20, 2024
సూక్ష్మదర్శిని కథలో ప్రియా (నజ్రియా నజీమ్) అనే సాహసోపేతమైన గృహిణి తన పొరుగు వ్యక్తి మానువెల్ (బసిల్ జోసఫ్) పై అనుమానం కలిగి, అతని తల్లి అదృశ్యంపై తనదైన శైలిలో విచారణ మొదలుపెట్టడం సినిమా కథ. ఈ అన్వేషణలో ఆమె కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుంటూ, చివరికి ప్రమాదంలో చిక్కుకుపోతుంది.
సినిమాలో నజ్రియా నటన ప్రేక్షకులను మెప్పించగా, బసిల్ జోసఫ్ పాత్రకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. కథలో ఆకర్షణీయమైన మలుపులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకున్నాయి.
జీ5 ఈ చిత్రానికి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేయగా, జీ నెట్‌వర్క్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. జనవరి రెండో లేదా మూడో వారంలో ఈ చిత్రం ఓటిటీలో ప్రసారం కానుంది.
ALSO READ: ఈ వారం OTT లో హడావిడి మామూలుగా లేదుగా!