Kanguva OTT release date:
నవంబర్ 14న భారీ అంచనాల మధ్య విడుదలైన కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన పీరియడ్ యాక్షన్-ఫాంటసీ చిత్రం Kanguva బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బోరింగ్ కథ, పలు సాంకేతిక లోపాలు వంటి కారణాల వల్ల విమర్శల పాలయ్యింది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటిటి విడుదలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, కంగువ డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ విడుదలకు ఒక నెల తర్వాత ప్రేక్షకులు ఓటిటి లో చూడనున్నారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#Kanguva OTT Release Sets To Premiere from December 12th On Prime Video pic.twitter.com/DrbJJKI0Vm
— OTT (@OTTUPDATE0) November 30, 2024
సినిమాలో సూర్య ద్విపాత్రాభినయంతో అభిమానులను బాగానే ఆకట్టుకున్నారు. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
బాక్సాఫీస్ విజయాన్ని సాధించకపోయినా, సూర్య అభిమానులు ఈ సినిమా ఓటిటి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో చూసే అవకాశం మిస్ అయినా ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సినిమాను ఇంట్లో నుండి చూడటానికి ఇష్టపడతారా లేదా చూడాలి.
ALSO READ: Bigg Boss 8 Telugu నుండి ఈ వారం బయటకు రానున్న హౌస్ మేట్ ఎవరంటే!