Bigg Boss 8 Telugu Tasty Teja remuneration:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడు ఫైనల్ దశలోకి చేరింది. ప్రతి ఎలిమినేషన్‌తో ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఇటీవల జరిగిన డబుల్ ఎవిక్షన్ వారంలో టేస్టీ తేజ బయటకు వెళ్లారు.
టేస్టీ తేజ అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఎనిమిది వారాలు హౌస్‌లో గడిపిన తేజ తన వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటి నుండి తన హాస్యంతో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా నవ్వించిన తేజ, చివరి వారాల్లో మాత్రం ప్రేక్షకుల అభిమానం కోల్పోయారు.
View this post on Instagram
లాస్ట్ సీజన్ లో ఫ్యామిలీ వీక్ దాకా ఉండలేకపోయాను అని చాలా బాధపడ్డ తేజ ఈ సారి కుటుంబ వారంలో తన తల్లి బిగ్ బాస్ హౌస్‌కి రావడం జీవితంలో మర్చిపోలేని రోజుగా మారింది. దీంతో ఒకరకంగా తేజ సంతృప్తితో హౌస్ నుండి బయటకి వచ్చేశాడు అని చెప్పచ్చు.
ఈ సీజన్‌లో తేజ వారానికి రూ. 1.5 లక్షలు రెమ్యూనరేషన్ పొందారు. ఎనిమిది వారాలకు రూ. 12 లక్షలు సంపాదించిన తేజకు ఆర్థికంగా కూడా ఈ సీజన్ మంచి ప్రయాణమైంది. గత సీజన్ 7లోకన్నా ఈ సారి తేజకు మరింత గుర్తింపు వచ్చింది.
ఫైనల్‌కు దగ్గర పడుతున్న కొద్దీ పోటీ మరింత కఠినంగా మారుతోంది. అవినాష్ టికెట్ టు ఫైనల్ టాస్క్ గెలిచి టాప్ 5లోకి చేరారు. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్లు ఉండగా, మరో డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక ఫైనల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే ప్రేక్షకులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది.
ALSO READ: The Raja Saab సినిమా గురించి లీక్ ఆయిన ఆసక్తికరమైన అప్డేట్స్!