Mahesh Babu’s sister-in-law Shilpa Shirodkar Bigg Boss remuneration:
90ల సమయంలో హిందీ సినిమాల్లో తన అందం, అభినయంతో అభిమానులను గెలుచుకున్న షిల్పా శిరోధ్కర్, Mahesh Babu మరదలు కూడా. ఇప్పుడు బిగ్ బాస్ 18 ద్వారా మళ్లీ ప్రజల దృష్టిలోకి వచ్చారు. సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న ఈ రియాలిటీ షోలో అడుగుపెట్టిన ఆరు వారాల్లోనే షిల్పా తన ప్రతిభను చాటుకున్నారు.
ఆమె పోటీ ఎంత కఠినమైనదైనా తన అసలు వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా ముందుకుసాగుతున్నారు. ఈ తీరు ఆమెకు ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన అభినందనలు అందిస్తోంది. షిల్పా బిగ్ బాస్ ఇంట్లో నిజాయితీతో కూడిన మంచి స్నేహాలను కూడా ఏర్పరుచుకున్నారు.
View this post on Instagram
బిగ్ బాస్ 18లో షిల్పా శిరోధ్కర్ అత్యధిక పారితోషికం పొందుతున్న వారిలో ఒకరిగా ఉన్నారు. ఆమె ఒక్కో వారం రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆరు వారాలకు ఆమె దాదాపు రూ. 15-18 లక్షల వరకు సంపాదించినట్లు సమాచారం.
షో ఉత్కంఠభరితంగా మారుతున్న ఈ సమయంలో షిల్పా చివరి వరకు నిలబడతారా అనే ప్రశ్న అందరిలో ఉంది. ఆమె వ్యక్తిత్వం, ఆటతీరు చూస్తుంటే ఆమె ఫైనల్కు చేరుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ALSO READ: Mega Hero వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!