Game Changer budget:
రామ్ చరణ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్ ఇక రిలీజ్‌కు సిద్ధమైంది! జనవరి 10, 2025న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో, ఈ సినిమా చాలా గ్రాండ్‌గా ఉండబోతోందని అందరూ భావిస్తున్నారు.
ఈ సినిమాకి బడ్జెట్ సుమారు రూ. 450 కోట్లు! అందులో నాలుగు పాటలకే రూ. 75 కోట్లు ఖర్చు చేశారంటే ఈ సినిమాపై వాళ్లు ఎంతగా నమ్మకంతో ఉన్నారో అర్థం అవుతుంది. జరగండి అనే పాటలో 600 మంది డాన్సర్లు, రా మచా మచా అనే పాటలో 1000 మంది డాన్సర్లతో షూట్ చేశారు.
స్టార్ కాస్ట్ రెమ్యూనరేషన్‌లు
రామ్ చరణ్ – రూ. 65 కోట్లు
కియారా అద్వాని – రూ. 5–7 కోట్లు
డైరెక్టర్ శంకర్ – రూ. 35 కోట్లు
సంగీతం, ప్రమోషన్స్
థమన్ అందించిన పాటలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ధోప్ అనే సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా దూసుకెళ్తున్నాయి. అమెరికాలో డల్లాస్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వేలాదిగా అభిమానులు వచ్చారు.
గేమ్ చేంజర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. IMAX, డాల్బీ సినిమా, 4DX ఫార్మాట్లలో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ సినిమా యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ అన్నీ కలిపి సూపర్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా ఉంది. రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి అనగానే తన తండ్రి రియాక్షన్ చూసి Keerthy Suresh షాక్ అయ్యిందట!