Most Watched Telugu webseries in 2024:
2024 సంవత్సరంలో తెలుగు ఒటిటి కంటెంట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ ట్రెండ్‌లో ముందంజలో నిలిచిన వెబ్ సిరీస్ #90s. కుటుంబ కథాంశంతో నడిచే ఈ డ్రామా, ప్రేక్షకులను ఆవిష్కరించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.
ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, కొత్త రికార్డులను సృష్టించింది. 300 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు సాధించిన ఈ సిరీస్, 2024లో అత్యంత ఎక్కువగా వీక్షించబడిన సిరీస్‌గా నిలిచింది. శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్, 1990లలో మధ్యతరగతి కుటుంబ జీవితాలను చక్కగా ఆవిష్కరించింది.
సాధారణ కుటుంబ భావోద్వేగాలకు, సరదా హాస్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ఆదిత్య హాసన్, తన కథనంతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. 90వ దశకంలో జరిగే సంఘటనల నేపథ్యంలో సాగిన ఈ కథ, ఆ కాలం జీవన విధానాలను, కుటుంబ సంబంధాలను, స్నేహితుల మధ్య అనుబంధాలను చాలా బాగా చూపించింది.
ఈ సిరీస్ విజయవంతం కావడం వల్ల ప్రధాన నటులైన శివాజీ, వసుకి కెరీర్‌లకు మంచి బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా, దర్శకుడు ఆదిత్య హాసన్ పేరు పరిశ్రమలో బాగానే మారుమ్రోగింది. ఇప్పుడు ఆయన ఒకేసారి రెండు ఫీచర్ ఫిల్మ్స్‌పై పని చేస్తున్నారు. ETV విన్ ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్న ఈ సిరీస్, అన్ని వయస్సుల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
ALSO READ: Top 10 highest grossing Pan-Indian Movies: ఈ జాబితాలో ఉన్న తెలుగు సినిమాలు ఏంటో తెలుసా?