HomeTelugu Trending2024 లో Hyderabad లో బాగా అమ్ముడయిన డెసర్ట్ ఏంటో తెలుసా?

2024 లో Hyderabad లో బాగా అమ్ముడయిన డెసర్ట్ ఏంటో తెలుసా?

Here's the most sold dessert in Hyderabad in 2024!
Here’s the most sold dessert in Hyderabad in 2024!

Most Sold Desert in Hyderabad 2024:

హైదరాబాదీ పండుగల సీజన్‌లో స్వీట్లకు ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది. ఈ ఏడాది, హైదరాబాదీ వీరాభిమాన డెసర్ట్ డబుల్ కా మీఠా స్విగ్గీపై 2.01 లక్షల ఆర్డర్లతో సంచలనం సృష్టించింది. ఈ నంబర్ హైదరాబాదీ ప్రజలకి స్వీట్ లపైన ఉన్న ప్రేమను చూపిస్తుంది.

పండుగ సమయంలో మోడరన్ డెసర్ట్లకు కాకుండా సాంప్రదాయ స్వీట్లకు ప్రాధాన్యం ఇచ్చారు. గీ మైసూర్ పాక్, కాజా, పూర్ణం బూరెలు, చూర్ణ, బూందీ లడ్డు, ఆప్రికాట్ కేక్ వంటి డెసర్ట్లు ప్రముఖంగా అమ్ముడయ్యాయి.

అంతేకాకుండా మదర్స్ డే రోజున హైదరాబాదీలు 8,050 కేకులు ఆర్డర్ చేశారు. అంటే ప్రతి నిమిషానికీ ఐదు కేకులు అమ్ముడయ్యాయి అన్నమాట. దీపావళి వేడుకల్లో మరింత స్వీట్ అమ్మకాలు జరిగాయి. ఓ వినియోగదారు కాజు కట్లీపై రూ.35,500 ఖర్చు చేస్తే, మరొకరు 40 బాక్సుల మోతిచూర్ లడ్డు కోసం రూ.31,460 ఖర్చు చేశారు.

హైదరాబాద్ లో భారీగా అమ్ముడయినది మాత్రం డబుల్ కా మీఠా. హైదరాబాదీ ప్రత్యేకతను ప్రతిబింబించే అద్భుతమైన డెసర్ట్ ఇది. బ్రెడ్ పుడ్డింగ్‌లాగా తయారవుతుంది ఈ స్వీట్. ఈ ఏడాది అధికంగా అమ్ముడయిన స్వీట్ ఇదే.

ALSO READ: 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న Most Expensive Villain ఎవరంటే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu