Top 10 highest grossing Pan-Indian Movies:
2024 భారతీయ సినీ పరిశ్రమకు మర్చిపోలేని సంవత్సరంగా మారింది అని చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్-ఇండియా రిలీజ్‌లతో ఈ సంవత్సరం ఎన్ని మరపురాని సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. దక్షిణ భారతీయ సినిమాలతో సమానంగా హిందీ సినిమాలు కూడా పోటాపోటీగా అద్భుతమైన కలెక్షన్లను సాధించాయి. అందులో Top 10 highest grossing Pan-Indian Movies జాబితా ఇలా ఉంది:
1. కల్కి 2898 AD – రూ. 1200 కోట్లు
ప్రభాస్ నటించిన ఈ ఫాంటసీ డ్రామా తెలుగు పరిశ్రమలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ చిత్రం 2024లో మొదటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
2. పుష్ప 2: ది రూల్ – రూ. 900 కోట్లు (ఇంకా థియేటర్లలోనే ఉంది)
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం టికెట్ కౌంటర్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సిరీస్‌లో రెండవ భాగం హిందీ మార్కెట్‌లోనూ విజయవంతమైంది.
3. స్ట్రీ 2 – రూ. 874 కోట్లు
ఈ హిందీ హారర్-కామెడీ పాన్-ఇండియా ప్రేక్షకులను అలరించింది. ఇందులో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించింది.
4. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ – రూ. 456 కోట్లు
ప్రీమియర్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచిన ఈ తలపతి విజయ్ చిత్రం ప్రత్యేకమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
5. భూల్ భులయ్యా 3 – రూ. 421 కోట్లు
కార్తీక్ ఆర్యన్ నటనకు మంచి స్పందన వచ్చింది.
6. సింగ్‌హమ్ అగైన్ – రూ. 389 కోట్లు
రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్ కలయిక మళ్లీ విజయాన్ని సాధించింది.
7. దేవర: పార్ట్ 1 – రూ. 520 కోట్లు
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం దక్షిణాది పేరు ప్రఖ్యాతలు డబల్ చేసింది అని చెప్పచ్చు.
8. ఫైటర్ – రూ. 344 కోట్లు
హిందీ ప్రేక్షకులను బాగానే ప్రభావితం చేసి కలెక్షన్లు రాబట్టింది.
9. అమరన్ – రూ. 360 కోట్లు
తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్.
10. హను-మాన్ – రూ. 350 కోట్లు
మొట్టమొదటి తెలుగు సూపర్‌హీరో సినిమా, ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది