HomeOTTOTT Releases: ఈవారం డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లో ఎన్ని సినిమాలు సందడి చేయబోతున్నాయో తెలుసా

OTT Releases: ఈవారం డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లో ఎన్ని సినిమాలు సందడి చేయబోతున్నాయో తెలుసా

Here's the list of OTT releases this week
Here’s the list of OTT releases this week

OTT releases this week:

ప్రతివారం లాగానే ఈ వారం కూడా చాలానే ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్.. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో చూడలేకపోయిన కొన్ని సినిమాలు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఓటిటిలో చూడడానికి రెడీ అవ్వండి. ఓటిటి ప్లాట్ ఫారం వైజ్ గా ఈ వారం OTT releases గురించి ఒకసారి చూద్దాం.

ఆహా:

తిరగబడరా స్వామి (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 19
వివాదాలతో ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయిన రాజ్ తరుణ్ నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది. థియేటర్స్ లో ఈ సినిమా అంతంతమాత్రంగానే నిలిచింది.

మారుతి నగర్ సుబ్రహ్మణ్యం (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 20

రావు రమేష్ ముఖ్య పాత్రలో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా.. ధియేటర్లలో ఉన్నప్పుడు కుటుంబ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇప్పుడు ఓటిటిలో విడుదలకు రెడీ అయ్యింది.

ఈటీవీ విన్:

సోపాతులు (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 19

ఇది కూడా ఒక వినోదాత్మక సినిమా. కోవిడ్ లాక్ డౌన్ లో విడిపోయిన ఇద్దరు పిల్లల కథ ఇది. పంచ్ డైలాగ్‌లు, వినోదం ప్రధానంగా బాగానే ఆకట్టుకుంటుంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

ది మిస్టరీ ఆఫ్ మోక్షా ఐలాండ్ (తెలుగు సిరీస్) – సెప్టెంబర్ 20

ఇది ఒక థ్రిల్లర్ సిరీస్, ఒకదీవిలో జరిగిన అనుమానస్పద ఆత్మహత్యలు ప్రధానాంశంగా సాగుతుంది.

ఆమేజాన్ ప్రైమ్ వీడియో:

తలైవెట్టియాన్ పాళయం (తమిళ సిరీస్) – సెప్టెంబర్ 20

ఈ తమిళ సిరీస్ యాక్షన్, సస్పెన్స్ డ్రామా పట్నంలో చదివి ఉద్యోగాలు లేక పల్లెటూరు లో ఉద్యోగంలో చేరిన ఒక యువకుడి కథ.

జియో సినిమా:

ది పెంగ్విన్ (ఇంగ్లీష్ సిరీస్ – తెలుగు డబ్) – సెప్టెంబర్ 20

ఇది ఒక థ్రిల్లర్ సిరీస్, ఒక అమ్మ తన బిడ్డను రక్షించేందుకు చేసే ప్రయత్నాలు ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది.

Read More: GOAT OTT రిలీజ్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్

Recent Articles English

Gallery

Recent Articles Telugu